పీఎస్ఆర్ ఆంజనేయులు కు మధ్యంతర బెయిల్ మంజూరు
అమరావతి: ఏపీపీఎస్సీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు సమర్పించారు.ఈ కారణాలతో పీఆర్ఎస్ ఆంజనేయులకు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు. కాగా జగన్ ప్రభుత్వ హయాంలో APPSPకి జరిగిన పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన్ను కొద్దిరోజులక్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్యన అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టులతో పీఆఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు..పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.