రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం వడగాల్పులు-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం (26-04-26) వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శనివారం ఉష్ణాగ్రతలు:- కర్నూలు(జి) నగరడోనలో 44.8°C, కడపలో 44.2°C, అనంతపురం(జి) రాయదుర్గం, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44°C, మార్కాపురం(జి) కంభం, శ్రీసత్యసాయి(జి) తలుపలలో 43°C, అన్నమయ్య(జి) నూలివీడు, పల్నాడు(జి) గురజాలలో 42.7°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42.6°C, తిరుపతి(జి) బేస్తపల్లిలో 42.5°C, అనకాపల్లి(జి) దేవరపల్లె, పోలవరం(జి) ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకుగాను 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని తెలిపారు.

