NATIONALPOLITICS

ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి

జమిలి ఎన్నికలు ఎప్పుడు..

అమరావతి: ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చింది..ఈ బిల్లు కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో సహా మరో బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు.. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గానూ పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను మేఘ్వాల్‌ కోరారు..

పార్లమెంట్ లో ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు.. ఏ పార్టీ తరఫున ఎంతమంది సభ్యులు ఉంటారో స్పీకర్‌ సాయంత్రానికి ప్రకటించనున్నారు.. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి సభ్యుడు కమిటీ చైర్మన్‌ ఉండనున్నారు..కమిటీలో ఉండేందుకు ఎంపీల పేర్లను ఈ రోజే ప్రతిపాదించాలని రాజకీయ పార్టీలను స్పీకర్‌ కోరనున్నారు..ప్రాథమికంగా ఈ కమిటీకి కాలపరిమితిని 90 రోజులుగా నిర్ధారించనున్నారు.. గడువు తరువాత అవసరం అయితే గడువు పొడిగించే అవకాశం ఉంది..జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు 32 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించినట్టు ఇప్పటికే రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ప్రకటించింది..

వాస్తవానికి భారతదేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని,, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి..అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు గాడి తప్పాయి..దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం ప్రారంభం అయింది..

జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ అటు రాజకీయ పార్టీల్లో,,ప్రజల్లోను పెద్దయెత్తున జరుగుతొంది.. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్‌ తేదీగా లోక్‌సభ తొలిసారి సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్‌ కమిటీ సిఫారసు చేసింది..దిని ప్రకారం తీసుకున్నట్లయితే ఈ లోక్‌సభ తొలి సమావేశం గత జూన్‌ 24న జరిగింది..అంటే లోక్‌సభ కాలపరిమితి తీరిపోయే నాటికి అంటే జూన్‌ 24, 2029 లోపు జమిలి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అంచనాలతో చూసినట్లయితే 2029లోనే జమిలి ఎన్నికలు ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *