నుడా ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి-మంత్రి ఫరూక్
నెల్లూరు: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ (నుడా) ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్ సూచించారు. మంగళవారం నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, నుడా విసి సూర్య తేజ,,నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రి ఫరూక్:- ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అందరి సహకారంతో నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని నుడా చైర్మన్ కు సూచించారు. కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి కష్టపడినందునే పదవి వరించిందన్నారు.
మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి:- రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి సాధనే లక్ష్యంగా నుడా పనిచేయాలన్నారు.రోజురోజుకీ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే టిడ్కో ఇళ్ల సముదాయంలో ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మంత్రి పొంగూరు నారాయణ:- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, 21 అర్బన్ అథారిటీలు ఉన్నాయన్నారు. పట్టణ జనాభా 34 శాతం వృద్ధితో ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్ అథారిటీలకు జాయింట్ కలెక్టర్లను వైస్ చైర్మన్లు గా నియమించామన్నారు.
నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఐ లవ్ నెల్లూర్ నినాదంతో పరిశుభ్రమైన, సుందరమైన నెల్లూరు ను తీర్చిదిద్దటానికి, అదేవిధంగా జిల్లా మంత్రుల సహాయ సహకారాలతో నుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.