సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సూపర్ స్టార్ రజనీకాంత్
అమరావతి: సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,,ముఖ్యంగా కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూపర్ స్టార్ రజనీకాంత్ సముద్రతీర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు..మన దేశ కీర్తిని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా చొరబడి విధ్వంసం సృష్టిస్తారని,, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు..ఈ సందర్భంగా 26-11 ముంబై ఉగ్రదాడి సంఘటనను రజనీకాంత్ గుర్తు చేశారు..ఈ దాడి సంఘటనలో సుమారు 175 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు..ఇలాంటి సంఘటనలకు అస్కారం లేకుండా సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు..ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 100 మంది CISF జవాన్లు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7 వేల కిలోమీటర్ల సైకిల్ పై ప్రచార యాత్ర చేపట్టనున్నారని తెలిపారు..వారు మీ ప్రాంతాలకు వచ్చేటప్పుడు స్వాగతించాలని వీలైయితే వారితో కొంచెం దూరం వెళ్లి వారికి మద్దుతు పలకాలని కోరారు.