పాపం,విడదల రజనీని బాధపెడుతున్నారంటా?
కృష్ణదేవరాయులకు రజనీ అంటే కోపం రక రకాల కారణాలు వుంటాయి?
అమరావతి: టీడీపీ ఎం.పీ కృష్ణదేవరాయులకు విడదల.రజనీ అంటే ఎందుకో,ఎందుకో కోపం…రక రకాల కారణాలు వుంటాయి….అంటూ వైసీపీ మంత్రి చిలకలూరుపేట మాజీ ఎమ్మేల్యే, విడదల.రజనీ వ్యాఖ్యనించారు. అమెపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో అదివారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అమె మాట్లాడుతూ రెడ్‌బుక్‌లో తనను టార్గెట్ చేశారన్నారు..అందులో భాగంగానే తనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు.. తనపై ఫిర్యాదు చేసిన వారిని ఇంత వరకు ఆసలు చూడలేదని చెప్పారు..