సోమశిల నుండి నారుమళ్ళకు సాగునీరు విడుదల-సోమశిల ఎస్ ఇ
నెల్లూరు: జిల్లాలోని రైతులు నారుమళ్ళు వేయుటకు గాను సోమశిల నుండి బుధవారం నీటిని విడుదల చేయడం జరిగిందని సోమశిల ఎస్ ఇ వెంకటరమణారెడ్డి, ఇరిగేషన్ SE నాయక్ లు తెలిపారు.ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సోమశిల లో నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా నీటిని విడుదల చేయడం జరిగిందని,మొదటి రోజున 2100 క్యూసెక్కులు విడుదల చేశామన్నారు.రైతులు తగు జాగ్రత్తలు పాటించి సాగునీరు వాడుకుని పంటలను పండించు కోవాలని కోరారు.జిల్లాలో 5 లక్షల 51 వేల ఎకరాలు ఆయ కట్టుకు ఈ సీజన్ లో నీరు అవసరం వుందన్నారు.
పెన్నా డెల్టా కింద 2,47,000 ఎకరాలు ,కనుపూరు కాల్వ కింద 66,000 ఎకరాలు ,కావలి కాల్వ కింద 1,24,000 ఎకరాలు ,నార్త్ ఫీడర్ ఛానల్ కింద 72000 ఎకరాలు ,సౌత్ ఫీడర్ కెనాల్ కింద 42,000 ఎకరాలు ఆయకట్టు సాగుకు నీరు అవసరం వుందనీ SE నాయక్ తెలిపారు.కనిగిరి, కనుపూరు, కావలి కాలువలకు ఈనెల 30వ తేదీ నుండి వచ్చేనెల 20 వ తేదీ వరకు రోజుకు 500 క్యూసెక్కులు , సర్వేపల్లి కాలువకు 20వ తేదీ వరకు 600 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు. జీకే ఎన్ కాలువకు తేదీ నవంబర్ 5 నుండి 19వ తేదీ వరకు 500 క్యూసెక్కులు, సౌత్ ఫీడర్ ఛానల్ కు 5 నుండి 19 తేది వరకు 300 క్యూసెక్కులు చొప్పున విడుదల చేయడం జరుగు తుందని తెలిపారు.
సోమశిల రిజర్వాయర్ కింద పెన్నా డెల్టా ,సోమశిల సిస్టంలో కె ఆర్ లెఫ్ట్ కెనాల్ కు 120క్యూసెక్కులు, మనుబోలు సిస్టం ట్యాంక్ స్లుయిస్ ద్వారా 200 క్యూసెక్కులు,1st బ్రాంచ్ కెనాల్కు 75 క్యూసెక్కు లు, ఎస్ ఎస్ జి కెనాల్స్ 2a, 2b,3,4,5,5a,6,7,8 a తదితర వాటికి 950 క్యూసెక్కులు , చెన్నై త్రాగునీటి అవసరాలకు 950 క్యూసెక్కులు, తిరుపతి శ్రీకాళహస్తి ఏర్పేడు ఇతర పట్నాలకు 100 క్యూసెక్కుల చొప్పున ఈనెల 30 వ తేదీ నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు కండలేరు నుండి నీరు విడుదల చేయడం జరుగుతుందని SE వెంకటరమణారెడ్డి తెలిపారు.