తెల్లరేషన్ కార్డుదారులకు నవంబరు నుంచి నాలుగు రకాల సరకులు
అమరావతి: కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తరువాత తెల్లరేషన్ కార్డుదారులకు నవంబరు నుంచి నాలుగు రకాల సరకులు అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే MLS పాయింట్లకు కందిపప్పు చేరింది..కార్డుదారులకు బియ్యంతోపాటు కందిపప్పు,,పంచదార,, జొన్నలు పంపిణీ చేయనుంది.. ఖచ్చితమైన తూకాలతో,, నాణ్యమైన సరకు సరఫరా చేసే గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించింది..అక్టోబరు నెలలో 50 శాతానికిపైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేశారు.. నవంబరులో ప్రతి కుటుంబానికి నాలుగు వస్తువులు అందించేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..చౌక ధరల దుకాణాలకు రేషన్ సరకుల సరఫరా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.