వర్రా.రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
అమరావతి: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, పులివెందలకు చెందిన వర్రా.రవీందర్‌రెడ్డికి కడప రెండో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.. రవీందర్‌రెడ్డిని పోలీసులు వేకువజామున జడ్జి ముందు హాజరుపరిచారు.. కేసు వివరాలను రవీందర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు..ఇరువర్గాలపై వైపు వాదనలు ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి.. వాదనలు విన్న మేజిస్ట్రేట్ రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.. రవీందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ఉదయ్‌రెడ్డి, సుబ్బారెడ్డిలకి 41-ఏ నోటీసులిచ్చి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు..విచారణ సందర్భంగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని వర్రా రవీందర్‌రెడ్డి జడ్జికి ఫిర్యాదు చేశారు..వర్రా మాటలను మేజిస్ట్రేట్ రికార్డు చేసుకున్నారు.. కడప రిమ్స్ లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి సదరు నివేదికను తనకు సమర్పించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు..అనంతరం అతడిని రిమాండ్ పై కడప జైలుకు తరలించారు.