నెల్లూరు ప్రభుత్వం వైద్యశాల్లో ENT డిపార్ట్మెంట్ లో HOD నియంతలా వ్యవహరిస్తున్నారా?
లేక కూర్చీల కుమ్ములాట…
నెల్లూరు: GGHలోని ENT డిపార్ట్మెంట్ HOD శ్రీదేవీ తనకు కేటాయించిన ఎగ్జిక్యూటివ్ కుర్చీ ఇవ్వకుండా నియంతల వ్యవహరిస్తున్నారని,, ఇందుకు నిరసనగా నేల మీద కూర్చుని డాక్టర్ సుకుమార్ (OP) అవుట్ పేషేంట్స్ ను చూసిన సంఘటన నెల్లూరు నగరంలోని ప్రభుత్వం వైద్యశాలల్లో మంగళవారం చోటు చేసుకుంది..
కొద్ది కాలం క్రిందట జరిగిన డాక్టర్ల బదలీల్లో బాగంగా ముగ్గురు డాక్టర్లు నెల్లూరు GGHకి వచ్చారు..ఇందులో ఒకరు Associate కాగా ఇద్దరు Assistantలు..బాద్యతలు చేపట్టినప్పటి నుంచి వీరి మధ్య సయోధ్యలేదని సిబ్బంది వ్యాఖ్యనిస్తున్నారు.. HODగా బాద్యతలు నిర్వహిస్తున్న డాక్టరు శ్రీదేవీ వ్యవహర శైలి జిజిహెచ్ సిబ్బంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు..ENT డాక్టరు సుకుమార్ కు డిపార్టమెంట్ లో మంచి పేరు వుంది..రోగులను పరీక్షించేందుకు అవసరమైన మైక్రోస్కోప్, తన సోంత నిధులు రూ.3.5లక్షలు వెచ్చించి కోనుగొలు చేసి,ఆసుపత్రికి అందచేశారని సిబ్బంది తెలిపారు..రోగులకు కూడా డాక్టర్లు సుకుమార్ కోసం వేచి చూసి,,వైద్యం చేయించుకుంటారని తెలుస్తొంది..
“ఆరోగ్యశ్రీ అపరేషన్స్ చేసిన డాక్టర్లకు ప్రభుత్వం కొంత మొత్తం ఇన్సింటెవ్ ఇస్తుంది..ఈ మొత్తం ఒక్కరే తీసుకుంటున్నారని,,అందరకి సమానంగా భాగం ఇవ్వడంలేదన్న విషయంపై అంతర్గతంగా వాదోపవాదలు జరిగినట్లు భోగట్టా?”…