వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు
అమరావతి: తెలుగు సినీ పరిశ్రమలో వివాదాస్పద దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద వర్మపై కేసు నమోదు చేశారు.. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినందుకు గాను, మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు..రామలింగం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.