రూ.2.94 లక్షల కోట్ల 2024-25కు పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఎన్డీఏ కూటమి
అమరావతి:రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సోమవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది..2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు..ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా, సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రాష్ట్ర బడ్జెట్:- రూ.43,402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్,,రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు,, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు,,రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు,,ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు,,జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం,,జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం…
వివిధ పద్దులకు కేటాయింపులు:- రూ. 4, 3402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్,,సంక్షేమం రూ.4,376 కోట్లు,, మహిళ, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు,,మానవ వనరుల అభివృద్ధి రూ. 1,215కోట్లు,,పాఠశాల విద్య రూ. 29,909 కోట్లు,,ఉన్నత విద్యకు 2,326 కోట్లు,,ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు,,పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు,,పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు,,గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు,, జలవనరులు రూ. 16,705 కోట్లు,,పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు,,ఇంధన రంగం రూ. 8,207 కోట్లు,, ఆర్ అండ్ బీ రూ. 9,554 కోట్లు,,యువజన, పర్యాటక, సాంస్కృతిక 322 కోట్లు,,పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు,,పర్యావరణ, అటవీ రూ.687 కోట్లుగా కేటాయింపులు జరిగాయి.