ఔట్ సోర్సింగ్ నియామకాలపై మంత్రివర్గ ఉపసంఘం-మంత్రి
కేబినేట్ లో కీలక నిర్ణయం..
అమరావతి: జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని,,జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన జరుగుతొందని మంత్రి కొలుసు.పార్దసారథి తెలిపారు..గురువారం సీ.ఎం అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ అనంతరం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్సలర్ మిట్టల్ నిస్సాన్ స్టీల్,, అనకాపల్లిలో క్యాపిటివ్ పోర్టును నిర్మించేందుకు క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకొవడం జరిగిందన్నారు..స్వర్ణ గ్రామం పేరుతో ఐఏఎస్లు పల్లె నిద్ర చేయాలని,,ఉన్నతాధికారులు 3 రోజులు, 2 రాత్రులు పల్లెనిద్ర చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు..ప్రభుత్వ శాఖలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా ఆప్కాస్ను ఎలా వినియోగించాలనే అంశంపై సీ.ఎం చర్చించారని తెలిపారు..ఆప్కాస్ ద్వారా దుర్వినియోగం:- గత వైసీపీ ప్రభుత్వం, ఓ పద్ధతి లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా దుర్వినియోగం చేసిందని,,విచ్చలవిడి నియామకాలతో వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిందని సీ.ఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు..ఒక్క టీటీడీలోనే 4000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని,, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సరైన విధివిధానాలు అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు..దీనిపై ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, ఔట్ సోర్సింగ్ నియామకాలను సక్రమ పద్ధతికి తీసుకొద్దామని సూచించారని వెల్లడించారు.