AP&TGCRIME

ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే రాష్ట్ర అభివృద్దికి కాని బియ్యం స్మగ్లింగ్ కు కాదు-డిప్యూటివ్ సీఎం

అమరావతి: ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే రాష్ట్ర అభివృద్దికి పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలకు వర్తించాలే కాని రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసేవారికి కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు..శుక్రవారం కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు..నౌకలో ఉన్న38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ప్రశ్నించారు..సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్లదూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు..

SP లీవ్ లో వెళ్లడం అనుమానంగా ఉంది:- బియ్యం ఆక్రమ రవాణాను స్వయంగా అయన పరిశీలించిన సందర్బంలో మీడియాతో మాట్లాడుతూ అధికారులు, స్మగ్లింగ్ కు అండగా ఉంటున్నట్లు కన్పిస్తొందన్న అనుమానం వ్యక్తం చేశారు.. పోర్టులోకి వెళ్లె అన్ని వస్తువులను కఠినమైన తనిఖీలు లేకుండా యధేఛ్చగా వెళ్లిపోతున్నాయి ? ఇదే అలుసుగా తీవ్రవాదులు రాష్ట్రంలోకి వస్తే ఏం చేస్తారు? పోర్టు అథారిటీ సభ్యులు ఏం చేస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు..ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం, దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం, పోర్టుకు కనీస రక్షణ కూడా లేదు, రోజు 1000 నుండి 1,100 లారీలు వస్తాయి, కేవలం 16 మంది సెక్యూరిటీ ఉన్నారు, దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు..నేను ఇక్కడ పరిశీలనకు వచ్చే సమయంలో SP లీవ్ లో వెళ్లడం అనుమానంగా ఉంది,,నిఘా విభాగం అధికారులు ఎందుకు ఇక్కడ లేరు అంటూ ప్రశ్నించారు..

అధికారులు అక్రమార్కులకు….. పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే కాని చర్యలు తీసుకోలేరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..బియ్యం అక్రమ రవాణాలోఎంతటివారు వున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. అక్రమాలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చర్యలు తీసుకోకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు.. అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారులు అక్రమార్కులకు సహకరించడం మంచి పద్ధతి కాదని మందలించారు.. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తానని హెచ్చరించారు..కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్రీ,, డీఎస్పీ రఘువీర్,, సివిల్ సప్లై డీఎస్ఓ ప్రసాద్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశారు..అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు..ఇక నుంచి అయిన అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *