అక్టోబర్ 2న మండపం, రామేశ్వరంల మధ్య కొత్త వంతెన ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అమరావతి:తమిళనాడులోని మండపం, రామేశ్వరంలను కలుపుతూ కొత్తగా నిర్మించిన పంబన్ సముద్ర వంతెనను అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.. 2019 మార్చి 1వ తేదిన ప్రధాన నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.. ఆగస్టు 11న భూమి పూజతో పనులు ప్రారంభయ్యాయి..ఈ కార్యక్రమం 22 నెలల విరామం తర్వాత రామేశ్వరంకు రైలు సేవలను తిరిగి ప్రారంభించింది..ప్రధాని తన రాష్ట్ర పర్యటన సందర్భంగా, చెన్నై విమానాశ్రయం,ఇతర ప్రదేశాలలో ప్రధాని అనేక ప్రాజెక్టులను కూడా ఆవిష్కరిస్తారు..
కొత్త రైల్వే వంతెన, బంగాళాఖాతంలోని పాక్ జలసంధి మీదుగా 2.05 కిలోమీటర్లు విస్తరించి, రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగానికి కలుపుతుంది..కొత్త వంతెన దేశంలోనే మొట్టమొదటి నిలువుగా లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి అని హై-స్పీడ్ రైళ్లకు అనుగుణంగా రూపొందించబడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.. ఈ వంతెనను భారతీయ రైల్వే యొక్క ఇంజనీరింగ్ విభాగం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ 535 కోట్లతో నిర్మించింది..
కొత్తగా నిర్మించిన పాంబన్ రైల్వే వంతెన పొడవు 2.078 మీటర్లు..అధికారి వర్గాల సమాచారం మేరకు వంతెన 100 స్పాన్‌లను కలిగి ఉంటుంది, ఒక్కొక్కటి 18.3 మీటర్ల పొడవు,, 63 మీటర్ల నావిగేషనల్ స్పాన్‌తో ఉంటుంది.. సముద్రంలో 333 కాంక్రీట్ పునాదులు నిర్మించారు.. 101 స్తంభాలతో ఈ రైల్వే వంతెన నిర్మాణం త్వరలో పూర్తి కానుంది..ఈ కొత్త రైల్వేవంతెనపై ఒకే సారి రెండువైపులా రైళ్లు నడిచేలా డబల్ ట్రాక్ వేస్తున్నారు..ఈ నావిగేషనల్ స్పాన్ పాత వంతెన యొక్క మాన్యువల్‌గా ఆపరేట్ చేయబడిన డబుల్-లీఫ్ బాస్క్యూల్ విభాగం కంటే 3 మీటర్ల ఎత్తులో ఉంది.. ఈ రైల్వే వంతెన దిగువన పడవలు, నౌకలు సులువుగా వెళ్లేలా వంతెన మధ్యలో పట్టాలు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలు ఏర్పాటు చేశారు.. పాత నిర్మాణంపై 19 మీటర్లతో పోలిస్తే, ప్రమాదాలు,వాటి వల్ల జరిగే నష్టాల ప్రమాదాన్ని తగ్గిస్తు,, కొత్త వంతెన నిర్మాణం సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎయిర్ క్లియరెన్స్‌ను అందిస్తు,,ప్రమాదాలను నివారించేందుకు వీలు కల్పిస్తుంది..కొత్త పంబన్ వంతెనపై లిఫ్ట్ స్పాన్ మెకానిజం పూర్తి చేసిన తర్వాత దక్షిణ రైల్వే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించిందని వర్గాలు వెల్లడించాయి.. రైల్వే వంతెనపై అక్టోబర్ 2వ తేది నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్ ప్రకటించారు.
రామేశ్వరాన్ని భారతదేశ ప్రధాన భూభాగానికి కలిపే పాత పాంబన్ రైలు వంతెన వాస్తవానికి 1914లో నిర్మించబడింది..1964లో పాంబన్ దీవిలో భారీ తుఫాన్ కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతింది..తరువాత 1988లో సమాంతర రహదారి వంతెన నిర్మించే వరకు మండపం-రామేశ్వరం మధ్య ఇది ఏకైక లింక్‌గా ఉండేది..2022 డిసెంబర్‌లో పాత వంతెన డబుల్ లీఫ్ సెక్షన్‌ను తీవ్రంగా తుప్పు పట్టడంతో రైలు సేవలు నిలిపివేశారు..అప్పటి నుంచి రామేశ్వరం కాకుండా, మండపం వరకు మాత్రమే రైళ్లను నడుపుతున్నారు.