స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరోను రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో( సెబ్ )ను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.. 2019 ఎన్నికల తర్వాత సెబ్‌ను ఏర్పాటు చేసింది..సెబ్ ఏర్పాటుకు సంబంధించిన 12 జీవోలను రద్దు చేస్తూ నేడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు విడుదల చేశారు.. సెబ్ ఏర్పాటు చేయక ముందు ఎక్సైజ్ శాఖలో 6,274మంది సిబ్బంది ఉండేవారు..వారిలో 70 శాతం అంటే 4,393 మందిని వైసీపీ ప్రభుత్వం సెబ్ విభాగానికి కేటాయించింది..దీంతో వారంతా ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా పని చేస్తున్నారు..తాజా ఉత్తర్వులతో వారంతా రిలీవ్ కానున్నారు.. సెబ్ సిబ్బంది, వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులంతా మాతృశాఖల్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి..వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ, పర్యవేక్షణలో పని చేయనున్నారు.