రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమిన్ ప్రీత్ సింగ్ అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అణచివేతకు ప్రాధాన్యం ఇచ్చి,,మాదక ద్రవ్యాలు వాడకం,,స్మగ్లింగ్ అణచివేతకు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నాడు.. సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు..సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమిన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ సేవిస్తుండగా ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..ఈ విషయమై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అమన్ ప్రీత్ సింగ్‌కు టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు..ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌ను వినియోగదారుడిగానే విచారిస్తున్నామని తెలిపారు..అయన తెలిపిన ఇతర వివరాలు ఇలా వున్నాయి….
నైజీరియకు చెందిన ఒనౌహా బ్లెస్సింగ్,,అజీజ్ నోహీం,,అల్లం సత్యవెంకటగౌతమ్,, సానబోయిన వరుణ్ కుమార్,,మహ్మద్ మహబూబ్ షరీఫ్ లను అరెస్ట్ చేసి 35 లక్షల రూపాయల విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌తో పాటు 2 పాస్‌పోర్టులు,,10 ఫోన్లు,,2 బైకులు స్వాధీనం చేసుకున్నారు..మరో ఇద్దరు డ్రగ్ సప్లయర్లు పరారయ్యారు.. నార్కోటిక్ బ్యూరో,, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించారు..డ్రగ్స్ కొనుగోలు చేసిన పలువురిని అరెస్ట్ చేశారు.. సినీ రంగానికి చెందిన పలువురికి పాటు వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.