AP&TGPOLITICS

వైసీపీ నాయకులు శ్రతువులు కాదు,రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే-పవన్ కళ్యాణ్

అమరావతి: వైసీపీ నాయకులు మనకు శ్రతువులు కాదు,,రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే..వైసీపీ నాయకులు జనసేనను శత్రువులుగా చూశారు…వాళ్లు చేసిన తప్పులు మనం చేయవద్దు…ఎవరి పైన వ్యక్తిగత దూషణలకు వెళ్లకండి…సబ్జెక్టుపై మాట్లాడండి… ఎవర్నీ తీవ్రపదజాలం,, పరుష పదజాలంతో మాట్లాడొద్దంటూ జనసేన నేతలకు జనసేన అధ్యక్షడు,,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ నాయకులకు,కార్యకర్తలకు సూచించారు..జనసేన తరపున ఎన్నికైన శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు, శాసన మండలి సభ్యులను సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సత్కరించారు..
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశ రాజకీయ చరిత్రలో ఓ పార్టీ వందశాతం గెలుపు ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదని,,అది జనసేన పార్టీకే సాధ్యమైందన్నారు.. జనసేన గెలుపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని,,మన పార్టీ గెలుపుపై నేను ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రతిఒక్కరూ నా వద్దకు వచ్చి నాతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారని తెలిపారు..ఈ ఘనత జనసైనికులు,వీరమహిళలదే అన్నారు..జనసేన పార్టీకి తగిలిన దెబ్బలు చాలా ఉన్నప్పటికి తట్టుకొని నిలబడ్డాం…గెలిచింది 21 స్థానాలే అయినా ఎన్డీఏ కూటమికి వెన్నుముకలా నిలిచేమన్నారు..
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అరాచకాలు చాలా ఉన్నాయని,,వారి ఆరాచకాలకు పరాకాష్ట ఏమిటంటే సొంత పార్టీ ఎంపీని పోలీసులతో కొట్టించారన్నారు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని,,అలాగే మనల్ని రోడ్డుపైకి రాకుండా భయబ్రాంతులకు గురిచేశారని చెప్పారు.. ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో అసెంబ్లీలో మొన్న జగన్ కు చూపించామని పవన్ అన్నారు.. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ చేసిందని,,వాటిపై వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు భయపడేవారన్నారు..వైసీపీ నేతలు చేసిన ఆరాచకాలపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యనించారు..
వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం కాదు…అలా అని మీ ఇంట్లో కుటుంబ సభ్యులను ప్రజలపై రుద్దకండి… అధికారం అడ్డుపెట్టుకుని మన పార్టీ వారు ఎవరైన రౌడీయిజం చేస్తే అలాంటి వాళ్ళని వదులుకోవడానికి అయినా నేను సిద్ధమే…మీ పిల్లలు రాజకీయాల్లోకి రావాలి…వారు సక్రమమైన మార్గంలో రావాలి.. సోషల్ మీడియాలో మహిళలపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు..పార్టీలో క్రమశిక్షణారహిత్యంగా ఎవరూ ప్రవర్తించకూడదన్నారు..ప్రజల కోసం నేను కుటుంబాన్ని పక్కన పెట్టి వచ్చాను…నా బిడ్డలా కోసం దాచిన డబ్బులను పార్టీకి ఖర్చు పెట్టానని పవన్ తెలిపారు.. ఇది మూడు పార్టీల సమిష్టి విజయం.. మన వల్లే విజయం దక్కంది అనే భావంతో ఎక్కడా మాట్లాడకండి అంటూ జనసేన శ్రేణులకు పవన్ దిశనిర్దేశం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *