ఏప్రిల్ లో విజయవాడ,తిరుపతిలో ఆదనంగా 1300ల స్లాట్స్-రీజనల్ పాస్పోర్ట్ అధికారి
అమరావతి: వేసవికాలంలో దరఖాస్తుదారుల రద్దీని క్లియర్ చేయడానికి ఏప్రిల్ 5వ తేదీ 2025న ప్రత్యేక “శనివారం డ్రైవ్”ను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి విజయవాడ ఒక ప్రకటనలో తెలిపారు..ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్ లను కూడా రీషెడ్యూల్ చేసుకోవచ్చు అని తెలిపారు..ఈ సదుపాయం దరఖాస్తుదారులకు అదనపు,ముందస్తు అపాయింట్మెంట్ లను ఇవ్వడం ద్వారా అవాంతరాలు లేని సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నమన్నారు.. విజయవాడ సేవకేంద్రంలో 800 స్లాట్స్,,తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్స్ ను ఏప్రిల్ 5వ తేదీకి అలాట్ చేయడం జరిగిందన్నారు.. అలాగే అదనంగా విజయవాడ సేవాకేంద్రం ఏప్రిల్ నెలలో ప్రతి బుధవారం 750 అపాయింట్మెంట్ స్లాట్స్ ను విడుదల చేసి బుధవారం డ్రైవర్లను కొనసాగిస్తామన్నారు.. దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్(www.passportindia.gov.in) ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు..పాస్పోర్ట్ సేవలు కోసం దరఖాస్తు చేసేటప్పుడు మధ్యవర్తులను ప్రమేయం లేకుండా దరఖాస్తుదారులకు ఏదైనా సందేహం వుంటే 0866-2445566 ఫోన్ చేసి వివరాలు తెలుససుకోవచ్చన్నారు..