ఛత్తీస్‌గఢ్,సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు-16 మంది మావోయిస్టులు హతం
అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సలైట్లు హతం కావడం, భద్రతా దళాలకు పెద్ద ముందడుగు పడినట్లు అయింది.. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్త బృందాలు కూబింగ్ ఆపరేషన్ చేస్తూన్నసమయంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్నవిశ్వసనీయ నిఘా వర్గాల సమాచారంతో శుక్రవారం రాత్రి కెర్లపాల్ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు..భద్రత దళాలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి ముందుకు వెళ్లుతున్న సమయంలో నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు..దింతో భారీ ఎదురు కాల్పులు జరిగాయి, ఫలితంగా 16 మంది నక్సలైట్లు మరణించారని తెలిపారు..ఎన్‌కౌంటర్ స్థలం వద్ద నుంచి రెండు AK-47 రైఫిళ్లు, దేశీయ తుపాకులు-భారీ మొత్తంలో మందుగుండు సామగ్రితో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. గాయపడిన భద్రత సిబ్బందిని వెంటనే సుక్మాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.