ఆది,సోమవారాలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి-జిల్లా రిజిస్టర్
తిరుపతి: ఆదివారం(30-.3-25),సోమవారం(31-03-25) రోజులను రిజిస్ట్రేషన్&స్టాంప్స్ శాఖ సంబంధించి వర్కింగ్ డేస్ గా ప్రభుత్వం ప్రకటించిందని తిరుపతి జిల్లా రిజిస్టర్ జి.శ్రీరామ్ కుమార్ తెలిపారు..కాబట్టి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో పాటు, తిరుపతి జిల్లాలోని 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.. ప్రజలు ఈ విషయమును గమనించి,పై తేదీల్లో ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా తమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు..ఏప్రిల్ 2వ తేదీ నుంచి తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నిమిత్తం స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయబడిందని తెలిపారు..కాబట్టి ప్రజలు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని, రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు..ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే జాయింట్ సబ్ రిజిస్టర్ ఫోన్-7093921664ను సంప్రదించగలరు అని కోరారు.