అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే లోపు బందీలను విడిచి పెట్టండి లేదంటే నరకం చూస్తారు-ట్రంప్
అమరావతి: పాలస్తీనా(గాజా)లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్నాయి.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్,,హమాస్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు..తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని,,ఈలోగా బందీలను విడుదల చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు..లేదంటే నరకం అంటే ఏమిటో చూస్తారని,,అలాగే గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు..
గతే సంవత్సరం అక్టోబర్ 7వ తేదిన ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేయడంతో 1000కి పైగా ప్రాణాలు కోల్పోయారు..దాడి అనంతరం దాదాపు 200 మందికిపైగా ప్రజలను హమాస్ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది..ఆ తరువాత తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా కొందరిని విడుదల చేసింది..బందీల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా,, ప్రస్తుతం 51 మంది సజీవంగా ఉన్నట్లు తెలుస్తొంది.. బందీలకు సంబంధించిన వీడియో హమాస్ మిలిటరీ విభాగం గత వారం విడుదల చేసి,ఇజ్రాయిల్ పై ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నించింది..ఈ వీడియోలో అమెరికా-ఇజ్రాయెల్ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ,, మమ్మల్ని హమాస్ చెర నుంచి త్వరగా విడిపించండి అంటూ వేడుకుంటూ కన్నీళ్లు పెటుకున్నారు.. దయనీయంగా వున్న ఈ వీడియో చూసిన ట్రంప్ పై విధంగా హమాస్ కు హెచ్చరికాలు చేశారు.