ఈ నెల 4వ తేదిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు
నెల్లూరు: నెల్లూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆదర్వర్యంలో 4వ తేది(ఆదివారం)ఉదయం 8.30 గంటకు ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో సబ్ జూనియర్ బాల,బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు విజయశంకర్ రెడ్డి,రమేష్ బాబులు తెలిపారు. జిల్లా జట్టుకు సెలెక్ట్ అయిన క్రీడాకారులు సెప్టంబరు 13 నుంచి 15వ తేది వరకు తూర్సు గోదావారి జిల్లాలోని అన్నవరంలో జరిగే 9వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్ అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీకు జిల్లా తరపును పాల్గొంటారని తెలిపారు.ఎంపికల్లో పాల్గొనే బాల,బాలికలు 02-01-2009 తరువాత జన్మించినవారు అర్హులన్నారు. ఎంపికల్లో పాల్గొనే వారు డేట్ ఆప్ బర్త్ సర్టిఫికేట్,,ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పని సరిగా తీసుకుని రావాలన్నారు. జిల్లా అసోసియేషన్ లో వుండే ఈ.సీ సభ్యులు,మండల అసోసియేషన్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.అలాగే ఎంపికలకు సహరిస్తున్న సీనియర్ క్రీడాకారులు,వ్యాయమ ఉపాధ్యాయుల క్రీడాకారులను తీసుకుని రావాలని కోరారు.సెలెక్షన్స్ కమిటీ సభ్యులు,టోర్నమెంట్ కమిటీ సభ్యులు,అంపైర్లు,క్రమశిక్షణా కమిటీ సభ్యుల సమక్షంలో ఎంపికలు జరుగుతాయన్నారు.ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పని సరిగా యూనిఫామ్ వేసుకుని రావాలన్నారు.