ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
అమరావతి: పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది..స్పెయిన్‌పై 2-1 తేడాతో గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది..దీంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.. సెమీఫైనల్స్ లో తుది వరకు పోరాడి 2-3 తేడాతో జర్మనీపై ఓడిపోయిన భారత్ గురువారం కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌పై విజయం సాధించింది..రెండో ఆఫ్ ప్రారంభంలో మొదటి గోల్ సాధించి స్పెయిన్1-0 అధిక్యంలోకి వెళ్లింది..సెకండ్ ఆఫ్ ఆఖరి నిమిషంలో భారత్ మొదటి గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేసింది..ఇక మూడో ఆఫ్ ప్రారంభంలో ఆట 33వ నిమిషంలో మరో గోల్ చేయడంతో భారత్ 2-0 అధిక్యంలోకి వెళ్లింది.. సింగ్ హరమన్‌ప్రీత్ భారత్ తరపున రెండు గోల్స్ చేశారు..మూడో ఆప్ ముగిసే సమయానికి భారత్ 2-1 అధిక్యంలో నిలిచింది..నాల్గవ ఆప్ లో స్పెయిన్ జట్టును విజయవంతంగా ఎదుర్కొని,,వారికి అవకాశం లేకుండా చేయడంతో భారత్ 2-1తో విజయం సాధించి కాంస్య పతకం తన కైవసం చేసుకుంది.
ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి..భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము,, ప్రధాని మోదీ,,అమిత్ షా,,నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు..అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు.