బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతం
ఇద్దరు భద్రత సిబ్బంది…
అమరావతి: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో అదివారం జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు..ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రత సిబ్బంది మరణించారు..బీజాపూర్ జిల్లాల్లోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతా దళాలకు విశ్వనీయమైన సమాచారం నిఘా వర్గాల నుంచి అందింది.. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూబింగ్ చేపట్టాయి..భద్రతదళాల కదలికలను గమనించిన మావోయిస్టులు,, భద్రతా దళాలపై కాల్పులకు దిగారు..దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో దాదాపు 5 గంటల పాటు ఇరు వైపులా హోరా హోరీ ఫైరింగ్ జరిగింది.. అనంతరం సంఘటన స్థలంలో 31 మావోయిస్టుల మృత దేహాలను భద్రత సిబ్బంది గుర్తించారు..ఈ ప్రాంతంలో ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి..
ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు భద్రతా సిబ్బంది,, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్ తోపాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన వారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు..అలాగే ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారని,,వీరిని ఆసుపత్రికి తరలించామన్నారు..వీరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారన్నారు.. వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.. హింసను వీడి, మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన సూచించారు.