AP&TGDEVOTIONALOTHERS

తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే-TTD EO J.శ్యామలారావు

తిరుపతి: తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని TTD EO J.శ్యామలారావు స్పష్టం చేశారు.. శుక్రవారం టీటీడీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లడ్డూ కల్తీపై వివరాలను వెల్లడిస్తూ ల్యాబ్‌ నుంచి వచ్చిన నివేధికల ఆధారంగా కల్తీ జరిగినట్టు గుర్తించి సరఫరాదారు నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశామని అన్నారు.. తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని,, అటువంటి చోట కల్తీ జరగడం దారుణమన్నారు..రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈవోగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు.. లడ్డూ నాణ్యత, ప్రమాణాలు తగ్గాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు..

2024 జులై నెలలో లడ్డూలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లతో సమావేశమై శుద్ధమైన నెయ్యిని సరఫరా చేయాలని సూచించామని పేర్కొన్నారు.. రూ.320కు-రూ.411 రూపాయలకు కిలో నెయ్యిరాదని అందరు చెబుతున్నందునే అనుమానం వచ్చిందన్నారు..దింతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ NDDB (నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) ల్యాబ్‌కు జులై 6న రెండు, జులై 12 న మరో రెండు ట్యాంకర్ల శాంపుల్లను పంపామని తెలిపారు.. AR ఫుడ్స్‌ కంపెనీ నుంచి సరఫరా అవుతున్ననెయ్యిలో ప్రమాణాలు లేవని, జంతువుల కొవ్వును వాడుతున్నారని నివేదిక వచ్చిందని ఆయన వెల్లడించారు..

టీటీడీకి సొంత ల్యాబ్‌ లేకపోవడంతో సరఫరాదారుల నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించలేకపోయారని ఈవో తెలిపారు..దీంతో సరఫరాదారులకు కల్తీ్ నెయ్యి సరఫరా వరంగా మారిందన్నారు.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం నాణ్యమైన లడ్డూ భక్తులకు అందుతుందని చెప్పారు.. నెయ్యి నాణ్యతను తెలుసుకోవడానికి అడల్ట్రీ ల్యాబ్‌ టెస్ట్‌ ఇక్విప్‌మెంట్‌ను విరాళంగా ఇచ్చేందుకు NDDB ముందుకు వచ్చిందని, విదేశాల నుంచి యంత్రాలు రావాల్సి ఉందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *