మయన్మార్ నుంచి మణిపూర్ లోకి అక్రమంగా చొరబడిన 900 మంది కుకీ మిలిటెంట్లు
అమరావతి: కూకీలు,మైటీ జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో అట్టడుకుతున్న సమయంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది..మయన్మార్ నుంచి వందల సంఖ్యలో కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి అక్రమంగా చొబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు..మయన్మార్ నుంచి దాదాపు 900 మంది కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.. వీరంతా ప్రస్తుతం 30 మంది సభ్యులతో కూడిన గ్రూపులుగా విడిపోయి రాష్ట్రంలో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు..ఈ నెల 28 నాటికి వీరంతా మైతీ గ్రామాలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక సంబంధిత అధికారులకు సమాచారం అందించాయి..వీరికి డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు, జంగిల్ వార్ ఫేర్ వాడకంలో శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన నివేదిక గురించి మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, మాట్లాడుతూ “ఇంటెలిజెన్స్ నివేదికను తేలికగా తీసుకోలేము”,, ఆక్రమంగా చొరబడినట్లు వస్తున్న వార్తలు తప్పు అని నిరూపించే వరకు,,చోరబాట్లు 100% సరైనదని తాము నమ్ముతున్నామన్నారు.. ఆక్రమచొరబాటు దారులను ఏరివేసేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు.. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.