క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.. 3 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా,ప్రధాని మోదీ క్వాడ్ సమ్మిట్ లో పాల్గొంటారు.. పలు ద్వైపాక్షిక సమావేశాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది..అమెరికాకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ రోజు నేను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన స్వస్థలమైన విల్మింగ్టన్ లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్ కు హాజరు కాబోతున్నానని తెలిపారు..న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురు చూస్తున్నానని మోదీ వెల్లడించారు..క్వాడ్ సమ్మిట్ లో నా సహచరులు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్,అస్ట్రేలియా ప్రధాన మంత్రి అల్బనీస్,జపాన్ ప్రధాని పుమియో కిషిడాను కలిసేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు..ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా క్వాడ్ సమ్మిట్ జరగనుంది..అలాగే అమెరికా అధ్యక్షుడితో జరిగే చర్చల్లో భారత ప్రజల ప్రయోజనాలు,,భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చలు జరగనున్నాయి..