AP&TGMOVIESOTHERS

దేవర సినిమా టిక్కెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం

నిర్మాత నాగవంశీ,జూ.ఎన్టీఆర్..

అమరావతి: జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదిన విడుదల కానున్నది..అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.. దేవర సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయా? టికెట్ రేట్లు పెరుగుతాయా అని చర్చ జరుగుతుండగా వాటిపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోలకు పర్మిషన్ తీసేసింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమకు మద్దతుగా నిలిచారు..ఇటీవల కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచి, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు.. ఇప్పుడు దేవరకు కూడా టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్, అర్ధరాత్రి షో లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లో అన్ని సినిమా హాళ్లలో బాల్కనీ టికెట్ ధర రూ.110 కి, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర పెంచుకుందుకు అనుమతి మంజూరు చేశారు.. మొత్తం 9 రోజుల పాటు స్పెషల్‌ షోలు ప్రదర్శనకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు..రోజుకు 6 షోల చొప్పున ప్రదర్శించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిర్మాత నాగవంశీ:- ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న సితార ఎంటెర్టైమెంట్స్ నిర్మాత నాగవంశీ, ఏపీ ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కందుల దుర్గేశ్ కి కృతజ్ఞతలు తెలిపారు..అడిగిన వెంటనే దేవర టికెట్ రేట్ల పెంపుకు, ఎక్స్‌ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. మీ సపోర్ట్ సినిమాని మరిన్ని థియేటర్స్, షోలతో ఆడియన్స్ కి చేరవేస్తుంది అని తెలిపారు..సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు..

జూ.ఎన్టీఆర్:- గౌరవనీయులైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌గార్లకు ధన్యవాదాలు.. ‘దేవర’ మూవీ విడుదల నేపథ్యంలో టికెట్‌ ధరలు, స్పెషల్‌ షోల ప్రదర్శనకు గ్నీన్‌సిగ్నల్‌ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.. తెలుగు సినిమాలకు సహకారం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *