NATIONAL

కొత్త లక్ష్యాల దిశగా భారత్‌ నిరంతరం ముందుకెళ్లాలని పటేల్‌ ఆకాంక్షించేవారు-ప్రధాని మోదీ

అమరావతి: దేశ ఐక్యతను దెబ్బతీసేలా కొన్ని“ఆర్బన్ నక్సల్” ముసుగులో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఐక్యత దెబ్బతీసే వారి కుట్రలు సాగనివ్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు..బుధవారం ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని, గుజరాత్‌ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద పటేల్‌ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పరేడ్‌ నిర్వహించగా,, బలగాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు..ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారితో ప్రధాని ఐక్యతా ప్రమాణం చేయించారు..కొత్త లక్ష్యాల దిశగా భారత్‌ నిరంతరం ముందుకెళ్లాలని పటేల్‌ అనేవారని,,మన దేశఉన్నతికి, వికాసానికి, ఉనికికి మూలం మాతృభాష అన్నారు..ఎలాంటి వివక్ష లేకుండా, అర్హత ఉంటే చాలు కేంద్ర పథకాలు అన్ని వర్గాలకు వారికి అందిస్తున్నామన్నారు..తాము అధికారంలోకి వచ్చాక వన్‌ నేషన్‌, వన్‌ ట్యాక్స్‌ విధానం తీసుకువచ్చామన్నారు.. అలాగే, వన్‌ నేషన్‌-వన్‌ పవర్‌ విధానం,, వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ విధానం తెచ్చామని,,వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ విధానం ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు..వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దేశ వికాసానికి దోహం చేస్తుందన్నారు.. ఏటా ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతోందన్నారు..దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వివిధ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కే చెందుతుందన్నారు..అలాగే దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉన్న ఆర్టికల్‌ 370ని తొలగించామన్నారు..ఆ తరువాత బలగాలు నిర్వహించిన కవాతుతో పాటు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *