కేరళలో కొండచరియలు విరిగిపడి 45 మంది మృతి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
అమరావతి: రాహుల్ గాంధీ ఎం.పిగా రాజీనామ చేసిన కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ప్రకృతి ప్రకోపంతో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి..ఈ దుర్‌ిటనలో 45 మంది మృతి చెందారు.. వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.. గాయపడ్డ 20 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు.. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు సంఘటాన స్థలానికి చేరుకుని మట్టిదిబ్బలను తొలగించే ప్రయత్నంలో వున్నారు..వీరికి తొడుగా అదనపు బృందాలు కూడా వయనాడ్‌కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు..భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలు మందకొండిగా సాగుతున్నాయి.. కొండచరియలు విరిగిపడడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి..మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇలాంటి విపత్‌ును తమ జీవితంలో ఇంత వరకు చూడలేదని స్థానికులు తెలిపారు..ముండకైలో వేకువజామున 1 గంటకు,, ఆటు తరువాత 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు.. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు పేర్కొన్నారు.. చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ప్రధాని నరేంద్ర మోదీ:- ఈ ప్రమాద ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ సూచించారు.