పట్టాలు తప్పిన హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ ట్రైయిన్ 18 బొగీలు-ఇద్దరు మృతి
అమరావతి: జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ వద్ద హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ ట్రైయిన్ (12810) మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో ఇద్దరు మృతి చెందగా,, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు..జంషేడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబూ ప్రాంతంలో వేకువజామున 3.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు,,పోలీసులు నిర్ధారించారు.. ఈ ప్రమాదంలో మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు..సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. మిగతా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు..ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో హౌరా-టిట్లాగఢ్-కాంటాబాంజీ ఇస్పత్ ఎక్స్ ప్రెస్,, హౌరా-బార్బిల్ జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ ట్రైయిన్స్ ను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.. ఎక్స్ ప్రెస్ ట్రైయిన్ ప్రమాదం జరిగిన ఘటనాస్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు..ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని తెలిపారు..అక్కడ జరిగిన ప్రమాదం వల్ల ఏ మేరకు నష్టం జరిగిందనే విషయంపై పరిశీలించాల్సి ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.