CRIMENATIONAL

గొలుసులతో మహిళను అడవిలో బంధించిన అగంతకులు

అమరావతి: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన సంఘటన వెలుగు చూసింది.. 50 ఏళ్ల అమెరికాన్ మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు..ముంబై నగరానికి 450 కిలోమీటర్ల దూరంలో ఉండే సోనుర్లి గ్రామంలో శనివారం సాయంత్రం అడవిలో ఓ పశువులకాపరికి పశువులను మేపుకుంటు వెళ్లెడు..మహిళ ఏడుపులు విన్పించడంతో అటు వైళ్లగా,,అక్కడ వున్న మహిళను చూసి షాక్‌కు గురయ్యాడు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు..వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె వద్ద అమెరికా పాస్‌పోర్ట్ జెరాక్స్ కాపీతో పాటు తమిళనాడు చిరునామాతో ఒక ఆధార్ కార్డు కూడా ఉన్నట్టు గుర్తించారు..ఈ రెండు గుర్తింపు పత్రాలను ఆధారంగా ఆమె ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


తీవ్ర అనారోగ్యంతో ఉన్న సదరు మహిళను కోంకణ్ ప్రాంతంలోని సావంత్‌వాడి ఆసుపత్రికి తీసుకెళ్లామని, మెరుగైన చికిత్స కోసం సింధుదుర్గ్‌ లోని ఆసుపత్రికి తీసుకెళ్లామని పోలీసుల అధికారి తెలిపారు.. ఇక ఆమె మానసిక, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మరింత మెరుగైన చికిత్స కోసం అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న గోవా మెడికల్ కాలేజీకి తరలించారమని వివరించారు..ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని, ఆమె వద్ద లభించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అర్థమవుతోందని వివరించారు.. సంబంధిత పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ బాధిత మహిళ వద్ద తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్,, అమెరికా పాస్‌పోర్ట్ జెరాక్స్ కాపీని గుర్తించామన్నారు..లభ్యమైన ధ్రువీకరణ పత్రాల ప్రకారం ఆమె పేరు ‘లలితా కయీ’ అని గుర్తించామని, ఆమె వీసా గడువు ముగిసిందని తెలిపారు.. ఆమె జాతీయతను నిర్ధారించేందుకు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌తో మాట్లాడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *