పారిస్ ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం
అమరావతి: పారిస్ ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం దక్కింది.. యువ షూటర్ మనుభాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది.. ఫైనల్ లో కొరియన్ షూటర్లు ఓయే జిన్ 243.2 (గోల్డ్),, కిమ్ యెజి (స్విలర్) 241.3 పాయింట్లు సాధించారు..మను భాకర్ 221.7 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది.
ఖర్మసిద్దాంతాని నమ్ముతా:- కాంస్య పతకం గెలిచిన అనంతరం అమె మీడియాతో మాట్లాడుతూ ఈ పతకం భారత్‌కు ఎప్పుడో రావాల్సిందని,, చాలాకాలం నిరీక్షణ తరువాత ఈ పతకం మన దేశానికి అందిందని చెప్పారు..ఒలంపిక్స్ క్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు సాధించాలని నేను కోరకుంటున్నాను అన్నారు.. ఈసారి వీలైనన్ని ఎక్కువ పతకాలు గెలవడం కోసం మేము ఎదురుచూస్తున్నామన్నారు.. కాంస్య పతకం గెలిచినందుకు నాకెంతో సంతోషంగా ఉంది…నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా…ఆఖరి షాట్ వరకు కూడా నేను పూర్తి స్థాయిలో పోరాడాను… ఇప్పుడు కాంస్యం గెలిచాను,, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నాను అని తెలిపింది..తాను తరచూ భగవద్గీత చదువుతానని,,అందులో మనం చేయాల్సిన విధులను ఫలితాలు ఆశించ కుండా చేయాలన్న గీతలోని సారంశం, అదే తన లక్ష్యంపై దృష్టి సారించేలా తోడ్పడిందని మను భాకర్ పేర్కొంది..ఇతర ఆటగాళ్లు కూడా ఈ క్రీడల్లో పతకాలు గెలవాలని కోరుతున్నానని వెల్లడించింది.