రోడ్డు ఆక్రమణలపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు- కమిషనర్ సూర్యతేజ
(కమీషనర్ దృష్టికి ట్రాఫిక్ పరిస్థితిని దారుణంగా మార్చిన నగర పాలక సంస్థ సిబ్బంది అవినితి రాలేదా అంటే ? ఒక వేళ రాకుంటే,,కమీషనర్ ఉదయం 3 గంట నుంచి 7 గంట వరకు మద్రాసు బస్టాండ్ వద్ద(కూరగాయల మార్కెట్,రోడ్డును ఆక్రమించుకుని వ్యాపారం చేసే వారిని తొలిగించండి..ఉదయన్నే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతల నుంచి వచ్చే నగరంలోకి RTC బస్సులు,,CARల్లో వచ్చే నగరవాసులకు నరకం కన్పిస్తొంది..మార్కెట్ ప్రక్కనే కూరగాయలు పండించే రైతులు వాటిని అమ్ముకునేందుకు పెద్ద స్థలమే వున్నప్పటికి,అందులో పెద్దగా ఎవరు వ్యాపారలు చేయడం లేదు..రోడ్డు మీద వ్యాపారం చేసే (దాదాపు 100 మంది అంటే రూ.2000 అంటే నెలకు 60,000 వేలు..) వారి వద్ద నుంచి నగర పాలక సంస్థ సిబ్బంది రూ.20 లెక్కన వసూలు చేస్తారు అనే ఆరోపణలు వున్నాయి ? ఇలాంటి వాటిపై దృష్టి సారించాల్సి అవసరం ఉంది కమీషనర్…)
నెల్లూరు: పాదచారులు, వాహన చోదకులకు అడ్డంకిగా మారి, ట్రాఫిక్ అంతరాయాలకు కారణమవుతోన్న రోడ్డు ఆక్రమణలపై జరిమానాలతో కూడిన కఠిన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన రోడ్లపై అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ కూడళ్లలోని ఐ ల్యాండ్ లను, డివైడర్లను పరిశీలించిన కమిషనర్, వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి పచ్చదనం పెంచాలని సూచించారు. ఫుట్ పాత్ లపై ఏలాంటి వాణిజ్య, వ్యాపార సైన్ బోర్డులు పెట్టవద్దని దుకాణదారులకు తెలియజేసి వాటిని తొలగించారు. నగర వ్యాప్తంగా ఫుట్ పాత్ లను పరిశీలించి ఆక్రమణలపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని రోడ్లపై ఉన్న భవన నిర్మాణ సామాగ్రి ఆక్రమణలను తొలగించేలా యజమానులకు నోటీసుల ద్వారా తెలియజేయాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరుగుతున్న పారిశుధ్య పనుల మానిటరింగ్ వ్యవస్థ పనితీరును కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్ర స్థాయిలోని సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బందితో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది హాజరును తనిఖీ చేసి వారికి కేటాయించిన లోకేషన్, ఇతర విధులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య్రక్రమంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, శానిటేషన్ అధికారులు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.