OTHERSSPORTS

అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నిక

అమరావతి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తదుపరి చైర్మన్‌గా BCCI సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ICC స్వతంత్ర చైర్మన్‌గా డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు..3వసారి ఈ పదవిలో కొనసాగేందుకు ప్రస్తుత ICC చైర్మన్ గ్రెగ్ బార్క్లే ఆసక్తి చూపకపోవడంతో, ఈ మేరకు ఆగష్టు 20వ తేదిన ప్రకటన కూడా చేశారు..నవంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియనుంది..దీంతో ఛైర్మన్ పదవికి ఏకైక నామినీ అయిన జై షా ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికయ్యారు.. ప్రపంచ దేశాల్లో క్రికెట్ పరిధిని పెంచడానికి,, క్రీడాభిమాన్లుల్లో ఆదరణ పెంచడానికి నిబద్ధతగా పనిచేస్తానని ఆయన చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *