ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు అక్రమించిన వారు తిరిగి ఇచ్చివేయాలి-నారాయణ
హైడ్రా తరహా చర్యలు తప్పవు…
అమరావతి: ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు,,కమ్యూనిటీ సెంటర్స్ కు సంబంధించిన స్థలాలు ఏవైనా కావొచ్చు, ఆక్రమిస్తే తిరిగి స్వచ్చంధంగా ఇచ్చేయండి…లేదంటే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని మునిసిపల్ శాఖమంత్రి నారాయణ హెచ్చరించారు.. విశాఖ కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ నిర్వహణ, సాలీడ్ వెస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ పనితీరు పరిశీలించారు..గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని,,ప్రధానంగా మున్సిపల్ శాఖ అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు..2021లో స్వచ్చభారత్ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం రూ.2980 కోట్ల మంజూరు చేసిందని,,అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతో,అ మొత్తం నిధులు వెనక్కి వెళ్లాయని మండిపడ్డారు..TDR బాండ్స్ విషయంలో కోర్టు అదేశాలతో కమిటీ వేయడం జరిగిందని,,కమిటీ నివేదికల తరువాత సెప్టంబరు చివరి నాటికి చర్యలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఆక్రమణలపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..ఆక్రమణదారులు కబ్జా చేసిన చేసిన స్థలాలు తిరిగి ఇవ్వకుంటే,, హైడ్రా తరహా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు..