యువ వైద్యులు దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలి-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తొలి స్నాతకోత్సవం..
అమరావతి: యువ వైద్యులు జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని,, వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు..మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..ఈ సందర్బంగా రాష్ట్రపతి ఉపన్యాసిస్తూ వైద్యవృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం, వారి సహకారం దేశం అభివృద్ధి చెందిన సమాజంగా మారుతున్నట్లు నిరూపిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చెప్పారు.. యువ వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు..సేవ ద్వారా యువ వైద్యులు కీర్తిప్రతిష్టలు పొందాలని, మన దేశం వైద్య సేవలలో ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకోవడంలో వీరి పాత్ర మరువలేనిదని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించే దేశం మన అందరి కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు..
తొలి స్నాతకోత్సవం:- గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ (AIIMS) మంగళవారం తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్,,ముఖ్యమంత్రి చంద్రబాబు,, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు ఘనస్వాగతం పలికారు.. అక్కడి నుంచి ఎయిమ్స్ కు చేరుకుని మొదటి బ్యాచ్‌గా వైద్య విద్యపూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేశారు..అలాగే ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.. కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రతాప్‌రావు జాదవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్, సంధ్యారాణి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు:- అత్యాధునిక సేవలు అందిస్తున్న AIIMSకు అన్ని రకాలుగా అండగా ఉంటామని,, AIIMS దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు..మరో 10 ఎకరాల భూమి AIIMS అధికారుల కోరిక మేరకు అందచేయనున్నట్లు తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా AIIMSకు అన్ని విధాల సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.