నటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు-ఏ నిమిషం అయిన అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీ.ఎం చంద్రబాబు,,డిప్యూటివ్ సీ.ఎం పవన్ కల్యాణ్,, హోంమంత్రి వంగలపూడి అనితపై జుగుస్పకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది..వైసీపీ అధికారంలో వున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి ఆసత్య ప్రచారం చేశారంటూ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి.పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు..టీడీపీ,, జనసేన,, బీజేపీ నేతలను,,వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని, శ్రీరెడ్డి బూతులు మాట్లాడారని పద్మ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు..దింతో శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు.. ఈ సంవత్సరం జులై 20వ తేదిన కూడా సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది..సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనితలపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు,,ఫలితాలకు రాక ముందు శ్రీరెడ్డి పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఫిర్యాదులో నాగరాజు పేర్కొన్నారు.. దీనికి సంబంధించిన అనేక వీడియోలు, క్లిప్పింగులతోపాటు పలు ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించారు..దీంతో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
https://x.com/i/status/1700502217411920225