రూ.99ల నుంచి నాణ్యమైన మద్యం అందుబాటులోకి-కేబినెట్ నిర్ణయం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పార్దసారథి మీడియాకు వివరించారు.. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ, నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది..ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న మద్యం ధరను రూ.99ల నుంచి అందుబాటులోకి వుంచాలని నిర్ణంయించింది..అలాగే వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్‌లో చర్చకు వచ్చింది.. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌కు తెలియజేశారు.. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు.. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు..వరదలు అధిక వర్షాల వల్ల పంట నష్టపరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని మంత్రివర్గ నిర్ణయించింది..వరద ముంపు సాయం కూడా అద్దెకు ఉండేవారు ఉంటే వారికే పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.. ఇంటి యజమానులు కాకుండా అద్దెకు ఉంటూ సామాన్లు పాడైన బాధితుల్ని గుర్తించి ఇవ్వాలని నిర్ణయించారు..గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోళ్లల్లో చేసిన అవకతవకలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.. రెండేళ్లల్లోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రిమండలి సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు.. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు..సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత వుంది..? ఏ నిబంధనల ప్రకారం సాక్షి పత్రిక కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దానిపైనా ఎంక్వైరీ వేయాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు.