మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయం-పవన్ కళ్యాణ్
అమరావతి: రాష్ట్ర ఆమలు చేస్తున్న పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్,, డొక్కా సీతమ్మ,, అబ్దుల్ కలాం పేర్లతో ఆచరణలోకి తీసుకుని వచ్చేందుకు నిర్ణయించడం అభినందనీయమని డిప్యూటివ్ సి.ఎం పవన్ కళ్యాన్ పేర్కొన్నారు..ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కి అభినందనలు తెలిపారు.. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరునే పెట్టుకున్నారని అన్నారు..అలాంటి దుస్సంప్రదాయానికి మంగళం పాడి, విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే ప్రముఖుల పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామం అన్నారు.. పాఠశాల విద్యార్థులకు, విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారని,, ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం అని పేర్కొన్నారు..
‘మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని,,ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ గాంచిన డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలన్నారు.. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అని తెలిపారు..అలాంటి వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయన్నారు..మన దేశపు మిస్సైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని తెలిపారు..మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారని అన్నారు.. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నారు.