అమెరికా పౌరసత్వం కోసం రూ.44 కోట్లు చెల్లిస్తే గోల్డ్ కార్డు
అమరావతి: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలను చేపట్టిన డోనాల్డ్ ట్రంప్,,ఎదో ఒక రకంగా ఖాజనను నింపేందుకు మార్గలకు అన్వేషిస్తున్నాడు..అమెరికా పౌరసత్వాన్నికోరుకుంటున్న వారికి రాచమార్గం ప్రకటించారు.. ఇందులో బాగంగా గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు..కేవలం అయిదు మిలియన్ల డాలర్ల (సుమారు 44 కోట్లు)లు చెల్లిస్తే,, అమెరికా పౌరసత్వం ఇస్తానంటూ ప్రకటిన చేశారు..రూ.44 కోట్లు చేల్లిస్తే ఇచ్చే గోల్డ్ కార్డుతో, గ్రీన్ కార్డు రెసిడెన్సీ స్టాటస్ వస్తుందని,, దీని ద్వారా విదేశీయులకు అమెరికా పౌరసత్వం పొందే మార్గం సులువు అవుతుంది..దాదాపు 10 లక్షల గోల్డ్ కార్డులను మంజూరీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు..పౌరసత్వ కార్డుల ద్వారా వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నట్లు సమాచారం..EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫర్లను ఇవ్వనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు..EB-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డు ఇస్తారు..గ్రీన్ కార్డుతో గోల్డ్ కార్డు ముడిపెట్టి,,డబ్బు సంపాదించడానికి ట్రంప్ ప్లాన్ సిద్దం చేశారు.. రూ.44 కోట్లు చెల్లిస్తే,రష్యాన్ వ్యాపారస్తులకు కూడా గోల్డ్ కార్డు ఇస్తారా అన్న విలేఖరి ప్రశ్నకు,,తప్పకుండా, రష్యాన్ వ్యాపారవేత్తల్లో చాలా మంది మంచి వ్యాపారస్తులు వున్నరంటూ ట్రంప్ సమాధానం ఇవ్వడం కోసమెరుపు.