తమిళహీరో అంటోనీ విజయ్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
అమరావతి: తమిళనాడులో 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న టీవీకే (తమిళగ వెట్రి కజగం) హీరో అంటోనీ విజయ్ పార్టీకి వ్యూహ కర్తగా రాజకీయ విశ్లేషకుడు,,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తాడని టీవీకే పార్టీ ప్రకటించింది..2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నటుడి అంటోనీ విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం (TVK) విజయం కోసం తాను పనిచేస్తానని బుధవారం అధికారికంగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.. చెన్నైలోని మహాబలిపురంలో జరిగిన టీవీకే ప్రథమ వార్షికోత్సవ సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది..ఈ సందర్బంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ “అతను (విజయ్) నాకు రాజకీయ నాయకుడు కాదు, అతను తమిళనాడుకు కొత్త ఆశ, అందుకే నేను ఇక్కడ ఉన్నాను… TVK నాకు రాజకీయ పార్టీ కాదు,, తమిళనాడులో కొత్త రాజకీయ ఒరవడిని చూడాలనుకునే లక్షల మంది ప్రజల కోసం ఇది ఒక ఉద్యమం, ”అని కిషోర్ అన్నారు.. ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు విజయ్‌కు ఎలాంటి సలహాలు ఇస్తారు? జనంలోకి దూసుకెళ్లేలా ఎలాంటి పదునైన నినాదాలు రూపొందిస్తారు అన్నదే ఆసక్తిగా మారింది.