CRIMENATIONAL

మహాకుంభమేళాను విచ్ఛినం చేసేందుకు ప్రయత్రించిన ఉగ్రవాది అరెస్ట్

ప్రపంచ వ్యాప్తంగా సనాతనధర్మాన్ని నమ్మే వారు అత్యంత దివ్యంగా భావించి,144 సంవత్సరాలకు ఒక్కసారి అవిష్కృతమైయ్యే (“మహాకుంభ్) తివ్రేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు అచరించే నదీ తీరంలో బాంబులతో భక్తులను చంపి నరేమేథం చేసి,మహాకుంభమేళాను విచ్ఛినం చేసేందుకు పాకిస్తాన్ తో పాటు వివిధ ఉగ్రవాద సంస్థలు విఫలయత్నం చేశాయి..దేశంలో సెంట్రల్ ఏజెన్సీలు,,ఉత్రరప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టిన జాగత్రలతో,ఉగ్రవాద సంస్థలు సఫలం కాలేక పోయాయి..

అమరావతి: బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన యాక్టివ్ టెర్రరిస్టును గురువారం వేకువజామున మూడు లైవ్ హ్యాండ్ గ్రెనేడ్‌లు, 13 కాట్రిడ్జ్‌లతో అరెస్ట్ చేసినట్లు ఉత్రరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు..ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ “మహా కుంభ్ ముగింపుకు ముందు, కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులతో కలసి (ఉత్రరప్రదేశ్ లో) అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని వివిధ ఏజెన్సీల నుంచి సమాచారం అందిందన్నారు..సదరు సమాచారం ఆధారంగా UP STF & పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.. UP ATS, ఉత్రరప్రదేశ్ లోని  కౌశాంబి నుంచి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌,, అలాగే పాకిస్తాన్ కు చెందిన ISIతో సంబంధాలు ఉన్న ఉగ్రవాది లాజర్ మసీహ్‌ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.. ఉగ్రవాది మసీహ్ పాకిస్థాన్ ఐఎస్‌ఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడని, సరిహద్దుల్లోని హ్యాండ్లర్ల నుంచి డ్రోన్‌ల ద్వారా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను అందుకుంటున్నాడని డీజీపీ కుమార్ తెలిపారు.. అతని వద్ద నుంచి 3 లైవ్ హ్యాండ్ గ్రెనేడ్‌లు, 2 లైవ్ డిటోనేటర్లు, 1 విదేశీ తయారీ పిస్టల్-13 కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నమని వెల్లడించారు..అంతే కాకుండా అతని వద్ద నుంచి తెల్లటి రంగు పేలుడు పౌడర్, నకిలీ చిరునామాతో ఆధార్ కార్డు, సిమ్ కార్డు లేని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..తమకు ఉన్న సమాచారం ప్రకారం, అరెస్టయిన ఉగ్రవాది జర్మనీకి చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) మాడ్యూల్ హెడ్ స్వర్ణ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీ కోసం పనిచేస్తూ,,పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ అధికారులతో నేరుగా టచ్‌లో ఉన్నాడని” చెప్పారు..మహాకుంభమేళా సన్నాహాల సమయంలో, మాసిహ్ కౌశాంబి, లక్నో-కాన్పూర్‌లలో ఉన్నారు” అని డిజిపి అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *