ఆంద్రప్రదేశ్ క్యూకడుతున్నా పరిశ్రమలు-ఎర్ర తీవాచితో స్వాగతం
అమరావతి: తెలంగాణలో ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్దమైన కంపెనీలు,,తమ పంథాను మార్చుకుని ఆంద్రప్రదేశ్ క్యూకడుతున్నాయి..2021, జూలైలో రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో 4 గిగావాట్ల సెల్స్,,4 గిగావాట్ల మాడ్యూల్స్ తయారుచేసే ఫొటో వోల్టాయిక్(పీవీ) సంస్థను ఏర్పాటుచేయనున్నట్టు ఆ సంస్థ గత సంవత్సరం ప్రకటించింది.. అనుమతుల కోసం పరిశ్రమల శాఖకు దరఖాస్తు కూడా చేసుకున్నది..తదనంతర రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో,, ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో రూ.1700 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని,,పరిశ్రమ స్థాపనతో 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రీమియర్ ఎనర్జీస్ తాజాగా స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది..తమ వ్యాపార వ్యూహంలో భాగంగా తెలంగాణలో ప్రతిపాదిత పెట్టుబడిని ఆంద్రప్రదేశ్ కి మార్చుకున్నట్టు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్,,నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లకు తెలియచేసింది..పరిశ్రమల స్థాపనకు రెడ్ కార్పేట్ పరుస్తున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (APIIC) ద్వారా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 269.71ఎకరాల భూమిని ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు కేటాయించింది..ఈ ప్రాంతంలో 4 గిగావాట్ల సోలార్ సెల్ టాప్‌కాన్,, 5 గిగావాట్ల సిలికాన్ ఇంగోట్,, వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది..స్థానిక ప్రభుత్వాలపై నమ్మకమే,,పరిశ్రమ వర్గాలు పెట్టుబడులతో ముందుకు వస్తాయి అనేందుకు నిదర్శనం.