భారతదేశ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ 105వ జయంతి నేడు
అమరావతి: ఒక శాస్త్రవేత్త దేశం గురించి,,తన చుట్టు వున్న సమాజం గురించి ఆలోచిస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో దివంగత విక్రమ్ సారాభాయ్ జీవితాన్ని పరిశీలిస్తే ఆర్దం అవుంతుందని డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు..నేడు విక్రమ్ సారాభాయ్ 105వ జయంతి..విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12న గుజరాత్‌లో జన్మించారు..అతని తండ్రి అంబాలాల్ సారాభాయ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పొషించారు.. విక్రమ్ సారాభాయ్ 1942లో శాస్త్రీయ నృత్యకారిణి మృణాళినిని వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె మల్లిక నటిగా,సామజిక కార్యకర్తగా పనిచేశారు..కుమారుడు కార్తికేయ కూడా సైన్స్ లో చురుకైన వ్యక్తిగా వ్యవహరించారు..భారతదేశంలోని అంతరిక్ష శాస్త్రాలకు మూలాధారంగా పిలువబడే ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL)ని 1947లో విక్రమ్ సారాభాయ్ స్థాపించారు..ఈ రోజు భారతదేశం అంతరిక్ష పరిశోధన,,అనుభంధ రంగాల్లో గణనీయమైన విజయాలు సాధిస్తుందంటే,స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే ఈ రంగంలో విశిష్ట సేవాలు అందించిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ దూర దృష్టీ కారణమే..భారతదేశంకు శాటిలైట్ అవశ్యకత గురించిన నాటి ప్రధాన మంత్రిని ఒప్పించి,ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడం ద్వారా దేశంలో అంతరిక్ష రంగంలో అభివృద్ది చెందిందని,మన దేశ అంతరిక్ష పితామహుడుగా కీర్తి పొందిన విక్రమ్ సారాభాయ్ సందర్బంగా మనస్సూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు.