అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై చర్చలు-మంత్రి పీయూష్ గోయల్
అమరావతి: అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కొనసాగించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్,, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వాషింగ్టన్‌లో మంగళవారం సమావేశమయ్యారు..ఈ విషయాన్ని మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా పోస్టులో తెలిపారు..తొలి దశ చర్చలు పూర్తి చేసే దిశగా చర్చలు జరిగాయని వెల్లడించారు..మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశం, అమెరికా తమ ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి..మొదటి దశను జూలై నాటికి,,రెండవ దశ సంవత్సరం సెప్టెంబర్-నవంబరు నాటికి పూర్తి చేయాలని,,మూడవ దశ వచ్చే సంవత్సరానికి పూర్తి చేసే అవకాశం వుంది..వీటిపై అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది..ఈ చర్చలలో మార్కెట్ యాక్సెస్,,రూల్స్ ఆఫ్ ఒరిజినల్,,నాన్-టారిఫ్ బారియర్స్ వంటి అనేక అంశాలు ఉంటాయని బ్లూమ్ బర్గ్ కథనంలో తెలిపింది..భారతదేశం తమ శ్రమాధార రంగాలైన టెక్స్ టైల్స్, రత్నాలు, ఆభరణాలు, లెదర్ గూడ్స్, గార్మెంట్స్, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, రసాయనాలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి ఉత్పత్తులకు సుంకాల సడలింపులను కోరుతోంది..ఇదే సమయంలో అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డైరీ, వ్యవసాయ ఉత్పత్తులైన ఆపిల్స్, ట్రీ నట్స్ వంటి రంగాలలో సుంకాల సడలింపులను కోరుతోంది..ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు తమ వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి, పరస్పర లాభాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.