వివేకానందుడి జీవిత యువతకు ఆదర్శనీయం-కలెక్టర్
నెల్లూరు: యువతీ యువకుల స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందులవారని, వారి జీవితం అన్ని తరాల వారికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ ఆనంద్ కొనియాడారు..సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానందుడి చిత్రపటానికి కలెక్టర్,ఇతర అధికారులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రభోదాలు నిత్య నూతనమని అన్ని తరాల వారికి, అన్ని వయసుల వారికి అనుసరణీయమన్నారు. ముఖ్యంగా యువతకు సానుకూల దృక్పధం అవసరమని, త్రికరణశుద్ధిగా నమ్మి కృషి చేస్తే సాధించాల్సిన లక్ష్యాన్ని చేరుకోవచ్చుననే వివేకానందుడి జీవిత పాఠం అందరికీ ఆదర్శనీయమన్నారు..ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ సూర్య తేజ, అడిషనల్ ఎస్పీ సౌజన్య, డిఆర్ఓ లవన్న, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.