AP&TGDEVOTIONALOTHERS

తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై గురువారం నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు-మంత్రి ఆనం

తిరుపతి: తిరుమ‌ల‌లో ఈ నెల 15 (గురువారం) నుంచి వీఐపీ సిఫార‌సు లేఖ‌లను స్వీక‌రిస్తామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ‌ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార‌సు లేఖ‌ల‌పై ఎల్లుండి నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు ఉంటాయ‌ని మంత్రి ప్ర‌క‌టించారు.మే 1 నుంచి జులై 15 వ‌ర‌కు సిఫార‌సు లేఖ‌ల బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు గ‌తంలో టీటీడీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. టీటీడీ బోర్డు స‌భ్యులు, ప్ర‌జాప్ర‌తినిధుల సిఫారసు లేఖ‌లు చెల్ల‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ప్రోటోకాల్ వీఐపీల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నాలు ఉంటాయ‌ని చెప్పింది. వేస‌వి సెల‌వులను దృష్టిలో పెట్టుకుని భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అప్పుడు టీటీడీ వెల్ల‌డించింది. అయితే, ఇప్పుడు ఆ గ‌డువును త‌గ్గించి మే 15వ తేదీ నుంచే ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార‌సు లేఖ‌ల‌ను స్వీక‌రిస్తామ‌ని మంత్రి ఆనం రామనారాయ‌ణ రెడ్డి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *