అమరజీవి ప్రాణత్యాగం ఆంధ్రులు ఎన్నటికి మరువరు-మంత్రి నారాయణ
త్వరలో రూ. వెయ్యికే ఇసుక…
నెల్లూరు: అమరజీవి ప్రాణత్యాగం..మన ఆంధ్రరాష్ట్ర మని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు..శుక్రవారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.
త్వరలో రూ. వెయ్యికే ఇసుక…3వ డివిజన్ ధీనదయాళ్ నగర్‌లో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ధరలు తగ్గిస్తే ధర్నాలు ఏంటో…? విడ్డూరంగా ఉందన్నారు..ప్రతీ నెలా 1వతేదీనే రాష్ట్రంలో 65 లక్షల మందికే ఫించన్లు అందచేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి…రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సంవత్సరానికి మహిళలకి ఇచ్చే మూడు సిలిండర్లను శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు మధ్యహ్నం 2 గంటలకు ప్రారంభిస్తున్నారన్నారు..ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని వైసీపీపై తనదైన శైలిలో నారాయణ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు..
అక్టోబర్ 15 తరువాత ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చామన్నారు. నెల్లూరు సిటీ పరిధిలో మైన్స్, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు సుమారు నాలుగు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారని తెలిపారు.. దీనివల్ల ట్రాక్టర్ ఇసుక రూ.4వేల నుంచి 5వేలు ఉంటే,ఒక్క సారిగా రూ.2వేల నుంచి 1500లకు తగ్గిందన్నారు..దగ్గరగా ఉంటే రూ.1500లు, దూరంగా ఉంటే రూ.2వేల లోపు ఖర్చవుతుందన్నారు..దీంతో ప్రజలు ఇసుకని స్వేచ్ఛగా తీసుకెళుతున్నారన్నారు..ఇసుక రేటు రూ.1200లకు రావాలన్న ఆలోచనతోనే ప్రజలకి దగ్గర ఏరియాలో రీచ్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు..ఏం చేయాలో…ఎలా చేయాలో…నాకు ఒకరు చెపాల్సిన అవసరం లేదని…నేను అధికారులతో, ప్రజాప్రతినిధులతో నిత్యం మాట్లాడుతూనే ఉంటానన్నారు..రాబోయే 10, 15 రోజుల్లో ఇసుక వెయ్యి రూపాయలకే వస్తుందన్నారు..మేము ధరలు తగ్గిస్తే…ఇప్పుడు వైసీపీ వాళ్లు ధర్నాలు చేయడం ఏంటోనని…అది విడ్డూరంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు..వాళ్లు ఎందుకు ధర్నా చేశారో అర్ధం కాక…ప్రజలే నవ్వుకుంటున్నారన్నారు..రానున్న ఐదేళ్లలో నగరంలోని రోడ్లు, డ్రైన్లన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.